ఈడీ విచారణ లో రకుల్ కి ఎదురైన ప్రశ్నలివే..?

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా డ్రగ్స్ ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇక రాబోయే కాలంలో ముందు ముందు ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయో అన్నట్లుగా కొంత మంది స్టార్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ఈడి ఇప్పుడు కొంత మందికి నోటీసులు పంపించింది. అలా పంపించిన వారిలో రకుల్ ప్రీతిసింగ్ నేను అడిగిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఇది అధికారులు రకుల్ ప్రీతిసింగ్ ను అడిగిన ప్రశ్నలు.. సందేహాలు..!

1). నటుడు నవదీప్ కు చెందిన క్లబ్ ఖాతా కు పెద్ద మొత్తంలో నిధులు ఎందుకు బదిలీ చేశారు?

2). టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్ మీకు తెలుసా?

3). వాట్సాప్ చాటింగ్ లో ఆర్థిక లావాదేవీల మీద ఎలా చర్చించారు? ఎందుకు చర్చించారు (అందుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ)

4). ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ తో ను ఆర్థిక లావాదేవీలు ఎందుకు చర్చించాల్సి వచ్చింది?

5). బాలీవుడ్ నటుడు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తో ఉన్న సంబంధం ఏమిటి?

ఇది అధికారులకు రకుల్ ప్రీతిసింగ్ చెప్పిన సమాధానాలు..?

1). కెల్విన్ నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు. అతని కలిసిందే లేదు.

2). ఈడి ఆరోపించినట్లుగా మనీలాండరింగ్ తప్పులకు పాల్పడలేదు.కావాలంటే నా బ్యాంకు ఖాతాలు చూడండి (అంటూ తన బ్యాంక్ స్టేట్మెంట్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది.)
3). నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు ఒకేసారే వెళ్లే.

4). ఎఫ్ క్లబ్ లో 2016లో ఒక పార్టీ జరిగింది.. అందుకే అక్కడికి వెళ్లాలి.

5). ఎఫ్ క్లబ్లో లోనే కెల్విన్ పరిచయమైందన్న ఈడి అధికారుల వాదనను రకుల్ కొట్టిపారేసిన సమాచారం.

6). ఇటీవల కెల్విన్ విచారించగా.. తను రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పడంతోనే తాజా విచారణ జరిపినట్లు గా ఈడి అధికారులు తెలిపారు.

7). ఎఫ్ క్లబ్బుకు నగదు బదిలీ చేయలేదంటూ బ్యాంకు ఖాతాల డీటెయిల్స్ ఇచ్చినట్లుగా సమాచారం.

8). కెల్విన్ తో నాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు అని తెలిపింది రకుల్ ప్రీతీ సింగ్.

9). నాకు డ్రగ్స్ అలవాటు లేదని తేల్చి చెప్పింది.