ఆర్జీవి – చిరంజీవి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా..!

శివ సినిమాతో ఆర్జీవీ ఉత్తమ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. అంతేకాదు తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి దర్శకుడు అంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఏ విషయము చెప్పనవసరం లేదు.. మెగాస్టార్ హీరోగా నాటి నుంచి నేటి వరకు సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో ఒక సినిమా ఆగిపోయింది.. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ దర్శకుడిగా కొనసాగుతున్న రామ్ గోపాల్ వర్మ అలాగే మెగాస్టార్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు.ఈ సినిమాకు హీరోయిన్ టబు ను కూడా ఎంచుకోవడం జరిగింది.మణిశర్మ సంగీత దర్శకుడిగా సెలక్ట్ అయ్యాడు. ఇక ఆ సినిమాకు వినాలని ఉంది అనే టైటిల్ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి రెండు పాటలు కూడా చిత్రీకరించడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ కు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చి ఈ సినిమా మధ్యలోనే ఆపేసి వెళ్ళి పోయారు అని కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది చిరంజీవికి అనుమానం వచ్చి సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పాడట. అది ఆర్జీవీ కి నచ్చక సినిమాను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది అని వార్తలు గట్టిగా వినిపించాయి.Vinalani Vundi (1998) - Ilaiyaraaja, Mani Sharma - Listen to Vinalani Vundi  songs/music online - MusicIndiaOnline

ఇక మొత్తానికి కొంతవరకు సినిమా షూటింగ్ జరుపుకుని ఆ తరువాత సినిమాను క్యాన్సిల్ చేయడంతో వీరిద్దరి కాంబినేషన్లో తిరిగి మళ్ళీ ఏ సినిమా రాలేదు.