ర‌ష్మిక కొత్త అడుగులు..ఆ డైరెక్ట‌ర్‌తో క‌లిసి అలా చేస్తుంద‌ట‌..?!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Free Download Rashmika Celebrities Wallpaper

ఇదిలా ఉంటే.. ర‌ష్మిక ఇప్పుడు కొత్త అడుగులు వేయ‌బోతోంద‌ట‌. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ ల‌క్కీ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ కూడా ఇచ్చింది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు రాహుల్ రవీంద్ర‌న్‌.

One Flop Turned World Topsy Turvy for Award-Winning Director

హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మారిన‌ రాహుల్ రవీంద్రన్.. ఈ మ‌ధ్య ర‌ష్మిక‌ను క‌లిసి ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ చెప్పాడ‌ల‌. అది ఆమె బాగా న‌చ్చి వెంట‌నే ఓకే చెప్పింద‌ని.. వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించ‌బోతోంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. అంతేకాదు, త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంద‌ని టాక్‌.