రామ్ చ‌ర‌ణ్‌తో డిస్నీ+ హాట్ స్టార్ భారీ డీల్‌..ఎందుకోస‌మంటే?

టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోబోతున్నాడు. ఈయ‌న న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ త్వ‌ర‌లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌గా.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించాడు చ‌ర‌ణ్‌.

Disney+ Hotstar Plans In India, Subscription Fee, And Other Details You Need To Know

ఈ మూవీలో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ చ‌ర‌ణ్‌తో భారీ డీల్ కుదుర్చుకుంద‌ట. అస‌లు విష‌యం ఏంటంటే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

मुंबई: होटल में रहने पर हो रही थी परेशानी, साउथ सुपरस्टार राम चरण ने खरीद लिया सी-फेसिंग बंगला - Entertainment News: Amar Ujala

బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేయగా.. అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ట‌. కాగా, దిగ్గజ ఓటిటి సంస్థల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒకటి. ఇప్పుడు దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ ఉంటే.. హాట్ స్టార్ స్థాయి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంది.