80 మిలియన్ వ్యూస్‌తో పుష్ప ఊచకోత

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కథ పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగున్నట్లు చిత్ర టీజర్లో తెలియజేసింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమా నుండి ‘దాక్కొ దాక్కొ మేక’ అనే ఫస్ట్ సింగిల్ పాటను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ పాటకు అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ పాట ట్రెండింగ్‌లో దూసుకుపోయింది. ఇక తాజాగా ఈ పాట మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి ఈ పాటకు ఇప్పటివరకు ఏకంగా 80 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో బన్నీకి తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఎలాంటి క్రేజ్ నెలకొందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్ప చిత్రం కోసం మిగతా భాషల ఆడియెన్స్ కూడా ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మలయాళ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.