జెర్సీ సినిమా రీమేక్ చేయడానికి కారణం అతడే అంటున్న షాహిద్ కపూర్..!

September 28, 2021 at 2:29 pm

నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా జెర్సీ.. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే హిందీలో ఈ సినిమా పూర్తిగా షూటింగ్ ముగించుకుంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు షాహిద్ కపూర్ వెల్లడించారు.. ఇకపోతే షాహిద్ కపూర్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల తో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఒక అభిమాని. మీరు ఈ సినిమా రీమేక్ చేయడానికి గల కారణం ఏంటి..? అని అడిగినప్పుడు షాహిద్ కపూర్ ఇలా సమాధానం ఇచ్చాడు..

జెర్సీ సినిమా నేను చూసినప్పుడు చూస్తున్నంతసేపు ఏడ్చాను.. నన్ను నాని తన నటనతోఏడ్చేలా చేశాడు.. ఇక ఈ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది..అందుకే ఎలాగైనా సరే ఈ సినిమాను రీమేక్ చేయాలని పట్టుబట్టి మరీ రీమేక్ చేయడం జరిగింది.. ఈ సినిమా రీమేక్ చేయడానికి గల కారణం కూడా నానినే అని తెలిపాడు షాహిద్ కపూర్. అంతేకాదు ఇప్పటి వరకు తనకు ఎవరూ ఫేవరెట్ డైరెక్టర్లు లేరని, మొదటిసారి జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని చూసిన తర్వాత ఆయనే నా ఫేవరేట్ డైరెక్టర్ అని కూడా తెలిపాడు షాహిద్ కపూర్.. ఇకపోతే జెర్సీ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు నాని ని బాగా ప్రశంసించారు. ఇక షాహిద్ కపూర్ ఎలాంటి ప్రశంసలు అందుకుంటారో మనం వేచి చూడాలి.

జెర్సీ సినిమా రీమేక్ చేయడానికి కారణం అతడే అంటున్న షాహిద్ కపూర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts