తన భర్త పుట్టినరోజు.. సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ జంట 2018లో వివాహబంధంతో ఒక్కటైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇది ఉంటే తాజాగా ప్రియాంకా చోప్రా తన భర్త నిక్ జోనస్ పై తనకున్న ప్రేమను మరొకసారి చాటిచెప్పింది. తన ప్రియుడు పుట్టినరోజు సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ లవ్ ఆఫ్ మై లవ్, అంత దయ, ప్రేమ ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఐ లవ్ యూ బేబీ అంటూ భర్త పై తనకున్న ప్రేమను వ్యక్త పరిచింది.

ఇది చూసిన నెటిజన్లు మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ నిక్ జోనస్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అనవసరంగా మాట్లాడడు. నన్ను ఎంతో ప్రభావితం చేశాడు. అతని వల్లే మిర్చి ఘాటు లాగా ఉండే నేను ఎంతో కూల్ గా మారిపోయాను అంటూ తెలిపింది. అయితే ప్రియాంక ప్రస్తుతం యూకేలో సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన భర్త పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం కోసం అమెరికాకు వచ్చింది.