జపాన్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టాలీవుడ్ హీరోయిన్..!!

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఎంతో మంది సినీ తారలకు, ఇతర భాషా చిత్రాలలో కూడా తమ నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించుకున్న విషయం తెలిసిందే.. సాధారణంగా మన స్టార్ హీరోయిన్ ల గుర్తింపు కేవలం భారతదేశ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇక్కడ ఒక సౌత్ ఇండియన్ కు చెందిన సినీ తార తన ప్రతిభను ఏకంగా జపాన్లో చూపించి ,అక్కడ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది.

ఆమె ఎవరో కాదు మీనా.. మీనా బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా తన సత్తా చాటింది. ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ముత్తు సినిమాను 1998 సంవత్సరంలో జపాన్లో విడుదల చేయగా, అశేష ప్రజాదరణ పొందింది ఈ సినిమా.. ఇక ఆ సినిమాను మొదటిసారిగా జపాన్ లో విడుదల చేశారు.. అంతేకాదు జపాన్ లో తెలుగు హీరో, హీరోయిన్ లుగా సత్తా చాటింది మాత్రం రజినీకాంత్, మీనా అని చెప్పవచ్చు.

meena: Meena celebrates four decades in cinema | Malayalam Movie News -  Times of India

ఇప్పటికీ ఆమె జపాన్లో ఒక స్టార్ హీరోయిన్ గా, డాన్సర్ క్వీన్ గా గుర్తింపు పొందింది. ఇప్పటికీ ఎవరైనా జపనీస్ చెన్నై వెళ్తే మీనా ఉన్నా, లేకున్నా, ఆమె ఇంటి దగ్గర నిలబడి ఫోటోలు తీసుకొని మరి వెళ్తారట.. అంతలా జపాన్ లో ఆమె తన క్రేజ్ కు ఒక ముద్రను వేసుకుంది