పవన్ కల్యాణ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడా.. అటు ఇండస్ట్రీలో సపోర్టు లేదు.. మరి ఇంట్లో..!

సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా అనుమానాలు రాకమానవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజంగానే ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడని తెలుస్తోంది. అది కేవలం రాజకీయాల కోసమా..? లేదంటే సినీ ఇండస్ట్రీ ప్రయోజనాల కోసమా..? అనే విషయం ఇప్పుడు చాలా గట్టిగా వినబడుతోంది.

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీపై, వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ దుమారం రేపుతున్నాయి. ఇది కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాదు.. ఇండస్ట్రీ కోసమే కదా..! మాట్లాడింది అనే వాళ్లు కూడా ఎవరూ లేరు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్లుగా సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు స్టార్ హీరోలు కూడా ఎవరూ స్పందించడం లేదు. ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై మెగా హీరోలు కూడా స్పందించలేదు.దీని పై అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ కోసం ఒక వ్యక్తి పోరాడుతుంటే కనీసం సపోర్టు కూడా చేయకపోతే ఎలా..? అంటూ కొంతమంది నిలదీస్తున్నారు. ఇక ఫిలిం ఛాంబర్ ఐతే ఏకంగా పవన్ మాట్లాడిన వాక్యాలకు మాకు సంబంధం లేదంటూ తెలియజేసింది.

ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా వ్యక్తిగత వ్యాఖ్యలే నని .. వాటిని సినీ ఇండస్ట్రీ కి ముడిపెట్టొద్దని ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఏపీ మంత్రి పేర్ని నాని తో కలిసి భేటీ అయిన నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్లు గా ఏపీ మంత్రి పేర్ని నాని తెలియజేశాడు. ఈ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి ఇంట్లో కూడా సపోర్టు లేదని అర్థమవుతుంది.