ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ లైనప్ చూస్తే.. బాప్ రే అనకుండా ఉండలేరు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్ మరింత పెరగనుంది. ఈ సినిమా తర్వాత వచ్చే ఇమేజ్ కు అనుగుణంగానే ఈ ఇద్దరు హీరోలు తమ తరువాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించారు.

ఇక ఎన్టీఆర్ అయితే ఏకంగా 4,5 సినిమాలను లైన్ లో పెట్టాడు. వారందరూ కూడా ప్రతిభావంతమైన దర్శకులే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు.

వీరు మాత్రమే కాదు.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు, తమిళ యువ దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ ఎన్టీఆర్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కే’ సినిమాను తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

బాలీవుడ్లో చారిత్రక చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న దర్శకులందరూ మంచి ఫామ్ లో ఉన్నవారే కావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.