నిందితుడు రాజు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా పోలీసులే చంపారా..?

చిన్నారిని అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు రాజు ఈ రోజు మరణించడం జరిగింది. ఇక అంతా ఆశించినట్లుగానే జరిగిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.అయితే ఇతను వారం రోజుల నుంచి కనిపించకపోయేసరికి.. అన్ని చానల్స్ చాలా గోల గోల చేశాయి. ఇక రాజును పట్టుకుంటే 10 లక్షల రూపాయలు రివార్డు కూడా ఇస్తామని పోలీసులు తెలియజేశారు.

ఎన్ని చెప్పినా కూడా రాజు ఆచూకీ తెలియకపోలేదు. కానీ అభం శుభం తెలియని చిన్నారిని పాశవికంగా చంపిన రాజు పై.. సమాజం నుంచి ఆగ్రహం చేసే వ్యక్తులు ఎక్కువయ్యారు.ఇక ఈ నిందితుడు రాజుని చంపేయాలని ఎన్కౌంటర్ ఒక్కటే ఇలాంటి సమస్యలకు పరిష్కారమని సజ్జనార్ మరోమారు రంగంలోకి దింపి న్యాయం చేయాలని చాలామంది వేడుకున్నారు.

కానీ అనుకోని పరిస్థితులలో రాజు మృతదేహం ఘటకేసర్ సమీపాన లభ్యం కావడంతో ఇంకా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజుని చంపేశారా లేదా చనిపోయాడు అన్న కోణంలో కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ పోలీసులు మాత్రం ఆయనది ఆత్మహత్య అని తేల్చారు. కానీ మరికొంతమంది ఇది ఆత్మహత్య కాదు హత్య అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలన్నీ నాటకీయంగానే సాగాయని.. రాజు ఎప్పటి నుంచి పోలీసుల అదుపులో ఉన్నాడు అన్నట్టుగా మాచారం.

ఇక రాజుని అనూహ్యరీతిలో చంపేశాం అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే పోలీసులు కోరుకున్న విధంగా రాజు మరణించలేదు.. కానీ తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకోండి చనిపోయాడని అనుకోవాల్సిందే.