గల్లీ రౌడీని లాంచ్ చేయనున్న మెగాస్టార్?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. స్నేహగీతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఎన్నో సినిమాలు తీసిన కూడా చాలా వరకు ఆ సినిమాలు అన్ని విజయాన్ని సాధించలేకపోయాయి.

 

ఇది ఇలా ఉంటే సందీప్ కిషన్ హీరోగా నటించిన గల్లీ రౌడీ సినిమా పై సందీప్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 11 సాయంత్రం 5:04 నిమిషాలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ బీవీ రాజ్ టీమ్ అఫీషియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గల్లీ రౌడీ ట్రైలర్ ని లాంచ్ చేయనున్న స్టేట్ రౌడీ అంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా స్నేహ శెట్టి నటిస్తోంది.