12 కోట్లు డిమాండ్ చేసిన కరీనా.. అంత అవసరమా అంటూ ట్రోలింగ్స్?

September 10, 2021 at 1:10 pm

బాలీవుడ్ కరీనా కపూర్ గురించి, అలాగే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లయిన తర్వాత కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే రామాయణం ఆధారంగా సీత పాత్ర కోణంలో సీతా ది ఇంకార్నేషన్ సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించి డానికి కరీనా ఏకంగా 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై కరీనా ను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. కరీనా గతంలో ఇచ్చిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీత పాత్ర పోషించడానికి 12 కోట్లు డిమాండ్ చేశారు అంట కదా అని అడగగా అందుకని అవును అని సమాధానమిచ్చింది.

అయితే మైథాలాజికల్ పాత్ర చేయడానికి అంత ఎక్కువ డిమాండ్ చేస్తారా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కరీనా ఈ డిమాండ్ పారితోషికం విషయంలో కాదని మహిళల గౌరవం సంబంధించిన విషయంలో అని తెలుపుతూ అలాగే ముఖ్యంగా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించే హీరో హీరోయిన్ల పారితోషికం ఎంతో వ్యత్యాసం ఉంటుందని చెప్పుకొచ్చింది. అలాగే ఈ విషయంలో గతంలో ఎవరూ మాట్లాడలేదని, పరిస్థితులు మారాయి ప్రస్తుతం దీని గురించి అందరూ మాట్లాడుతున్నారని తెలిపింది.

12 కోట్లు డిమాండ్ చేసిన కరీనా.. అంత అవసరమా అంటూ ట్రోలింగ్స్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts