ఖిలాడి సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదల..?

September 10, 2021 at 12:59 pm

రవితేజ హీరోగా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిర్మాతలుగా స్టూడియోస్ ఎల్ఎల్పీ పతాకంపై సత్యనారాయణ కోనేరు, వర్మ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, మీనాక్షి చౌదరి ,డింపుల్ హయాతి ,ముకుంద వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.. అదేమిటంటే ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ ను ఈరోజు వినాయక చవితి సందర్భంగా “ఇష్టం” అనే సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది ఖిలాడి సినిమా చిత్ర బృందం. ఈ వీడియోలో మనం హీరో , హీరోయిన్ ఇద్దరిని చాలా నాచురల్ గా చూడవచ్చు.అంతేకాదు పకృతి మధ్య ఈ సాంగ్ తీసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. పాట మాత్రం చూడడానికి చాలా బాగుంది అంటూ.. అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక యాక్షన్ సినిమా అయినప్పటికీ పాట ప్రకృతి వడిలో చిత్రీకరించడంతో ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ నా లేక యాక్షన్ సినిమా అంటూ కన్ఫ్యూజన్ వ్యక్తం చేస్తున్నారు కొంతమంది సినీ ప్రేక్షకులు.https://youtu.be/BMmQSraC_oo

ఖిలాడి సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదల..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts