టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రూపొందనుంది. ఇతను భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. కేవలం అద్భుతమైన ప్లేయర్ గానే కాకుండా, స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఓ సినీ తారతో ప్రేమాయణం నడిపినట్టు ఇటు క్రికెట్ లోకం, అటు సినిమా ప్రపంచంలో తీవ్రంగా ప్రచారం జరిగింది. క్రికెట్ నా జీవితం. ఆ క్రికెట్టే నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేసింది, నా ప్రయాణం బయోపిక్ రూపంలో వెండితెరపై రానుండటం పట్ల భావోద్వేగానికి లోనవుతున్న అంటూ సౌరవ్ గంగూలీ ప్రకటించారు.
ఈ బయోపిక్ ను తీసేందుకు నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఇప్పటికే రెడీ అయ్యారు. లవ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించినున్నట్లు తెలుస్తోంది. అలాగే గంగోలి పాత్ర పోషించిన నటుడు, ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుడు ఎవరు అనే వివరాలు ఇంకా ప్రకటించలేదు.