ఆ తప్పు చేయడంతో దర్శకుడికి క్షమాపణ చెప్పిన రష్మిక..!

కన్నడ సినీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో తన సత్తా ఏంటో చాటి, ఇప్పుడు ఏకంగా నేషనల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన. ఇటీవల స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాన్ని కొట్టేసింది.ఇక తన సినీ జీవితాన్ని మరి కాస్త ముందుకు తీసుకు వెళ్తోంది. మొదట ఛలో సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె సరిలేరు నీకెవ్వరు సినిమా తో వెనుతిరిగి చూడలేదు.

ఇకపోతే తనను ఛలో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల.. ఇటీవల భీష్మ కోసం హీరోయిన్ పాత్రకు రష్మిక ను సంప్రదించగా, ఆమె వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం.. ఇకపోతే సెప్టెంబర్ 8వ తేదీన దర్శకుడు వెంకీ కుడుముల పుట్టినరోజు కాబట్టి, అందరూ ఆయనకు విషెస్ చెప్పారు. కానీ రష్మిక మందన మాత్రం లేటుగా అర్ధరాత్రి 12 గంటలకు అంటే ఒక్క నిమిషం దాటితే సెప్టెంబర్ 9 వస్తుంది అనగా ఆమె బర్త్డే విషెస్ తెలపడం గమనార్హం..Chalo director signs his next film - Telugu Lives

కానీ రష్మిక మందన వెంకీ కుడుముల కు క్షమాపణలు కోరుతూ బర్తడే విషెస్ తెలిపినట్టు తెలుస్తోంది. ఇంత ఆలస్యంగా బర్త్డే విషెస్ తెలపడానికీ గల కారణం ఏమిటి అంటే, పుష్ప సినిమా షూటింగ్ మారేడుపల్లి లో జరుగుతోంది కాబట్టి అక్కడ కొండప్రాంతాల్లో సిగ్నల్ సరిగా లభించదు. అక్కడ రష్మిక సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది కాబట్టే ఇలా ఆలస్యం అయినట్లు వివరించింది.