భారతదేశంలో క్రికెటర్ లకి ఉన్న క్రేజ్, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిని సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ అభిమానిస్తుంటారు.ఈ నేపథ్యంలోనే పలువురు హీరోయిన్ లు ఏకంగా క్రికెటర్ లతోనే ప్రేమలో పడ్డారు. బాలీవుడ్ నటి మృణాళ్ ఠాకూర్ కూడా ఓ క్రికెటర్ని ప్రేమించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడు క్రికెట్ నేపథ్యంలో హీందీలో రీమేక్ అవుతున్న జెర్సీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
అయితే మృణాళ్ ఇటీవల ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఒకప్పుడు విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించినట్లు తెలిపింది. తన సోదరుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టమని అలా తాను కూడా క్రికెట్ చూడటం, తర్వాత ఇష్టపడడం మొదలుపెట్టి ఈ నేపథ్యంలో కోహ్లీ ఆట చూసి ప్రేమలో పడిపోయినట్లు తెలిపింది ఈ ముద్దు గుమ్మ. దాదాపు ఐదేళ్ల క్రితం విరాట్‌తో కలిసి స్టేడియంలో ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.తాను ఆ రోజు నీలిరంగు జెర్సీ ధరించి టీమిండియా తరపు చీర్స్ చేసినట్లు అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది మృణాళ్.