మహేష్ బాబు ఆ రికార్డు ను సాధిస్తాడు అంటున్న అభిమానులు..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిన విషయమే.ఇక మహేష్ బాబు సినిమాలలో నటించి తనదైన శైలిలో రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాడు.ఇక అంతే కాకుండా మహేష్ బాబు ఎక్కువగా తన తండ్రి జాడల్లోనే సినీ ఇండస్ట్రీకి ఏదైనా కొత్తదనాన్ని పరిచయం చేయాలని ఆతృతతో ఉంటాడు.

అయితే ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ తో మహేష్ బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలని తమ ఫాన్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.మహేష్ బాబు ఇప్పటి వరకు వరుసగా నాలుగు సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోలేదు.గతంలో దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత వన్ నేనొక్కడే సినిమా ఫ్లాప్ ను చవి చూసింది.

ఇక ప్రస్తుత మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమాతో అరుదైన రికార్డు ను సొంతం చేసుకోవాలని తమ ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ఈ సినిమా సక్సెస్ ఇచ్చి మహేష్ బాబు తన ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తారు లేదో వేచి చూడాల్సిందే.