మా లో ఆ విషయంలో మార్పు తీసుకొస్తాను.. మంచు విష్ణు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎలక్షన్లు తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఈ మా ఎలక్షన్ రిజర్వేషన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్ లో సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మా లో మార్పులు తీసుకు వస్తానని, అలాగే ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ ను కల్పిస్తాను అని మంచు విష్ణు తెలిపారు.

మా ఎన్నికలలో ఇలాంటి పోటీ ఇంతకుమునుపు ఎప్పుడూ చూడలేదని, మా సభ్యులు గ్రూపులుగా విడిపోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ఎన్నిక తీరుపై ఎవరు సంతోషంగా లేరని, ఈ ఎన్నికల గురించి సోషల్ మీడియాలో, మీడియా లలో ఎక్కడ చూసినా రకరకాల వార్తలు వినిపించడం బాధాకరమని ఆయన అన్నారు.

ఇక తన ప్యానల్ లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ కూడా ఇప్పటికే తన ప్యానల్ లో సభ్యులను ప్రకటించారు.