కమెడియన్ ఆలీ రియల్ లైఫ్ ఇంత లగ్జరీగా ఉంటుందా?

September 25, 2021 at 9:27 am

కమెడియన్ ఆలీ తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను అందుకుని ప్రేక్షకుల మనసులలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అలాగే సినిమాలో తనదైన శైలిలో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు.

అయితే తెరపై అలీ ఏ విధంగా ఉంటాడు మనందరికీ తెలిసిందే. కానీ ఆలీ తన ఇంటిలో ఏ విధంగా ఉంటాడు. అలీ ఇల్లు ఎలా ఉంటుంది? ఇలా ఎన్నో రకాల విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఎక్కువగా తిని అవుతున్న వీడియోలో హోమ్ కూడా ఒకటి. తాజాగా కమెడియన్ ఆలీ కి సంబంధించిన హోమ్ టూర్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను ఆలీ భార్య జుబేదా డిలీట్ చేసింది. ఇందులో కమెడియన్ ఆలీ కి వచ్చిన అవార్డులు,రివార్డులు ఫోటోలు ఈ వీడియో కి హైలైట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు.

అంతేకాకుండా వీరి ఇంట్లో హాలు, డైనింగ్ టేబుల్, అలాగే నమాజ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి సకల సౌకర్యాలతో ఆలీ ఇల్లు లగ్జరీగా ఉంది. ఆలీ గురించి తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చూడాల్సిందే మరి.

కమెడియన్ ఆలీ రియల్ లైఫ్ ఇంత లగ్జరీగా ఉంటుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts