టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే అంటున్న ఉమాదేవి?

ఉమాదేవి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కార్తీకదీపం సీరియల్ లో అర్థ పావు భాగ్యం పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఉమాదేవి ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి గడగడలాడించింది. మొదటి వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఉమా దేవస్య ఉగ్రరూపస్య సినిమాను చూపించేసింది.

రెండవ వారం కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత ఆమె మాట్లాడిన బూతులే ఆమె పాలిట శాపంగా మారాయి. దీనితో ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి వీల్లేదు అంటూ ప్రేక్షకులు డిసైడ్ చేయడంతో రెండో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది.ఇదిలా ఉంటే తాజాగా ఉమాదేవి ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడింది.

రెండో వారం నుంచి వచ్చేయడం బాధగా ఉందని, బిగ్ బాస్ హౌస్ ను మిస్ అవుతున్నాను అని తెలిపింది. ప్రియా, ప్రియాంక ల తో కిచెన్ లో కలిసి పని చేయడంతో తాము మంచి ఫ్రెండ్స్ అయ్యాము అని తెలిపింది. అంతే కాకుండా కెప్టెన్ గా పనిచేసిన సిరి,విశ్వ లలో విశ్వ పర్ఫెక్ట్ అని తెలిపింది. ఇక జెస్సి, మానస్, రవి, సన్నీ.. టాప్ ఫైవ్ లో ఉంటారని ఆమె అభిప్రాయపడింది. అంతేకాకుండా సన్నీ అన్ని ప్రదేశాలలో ఒకేలా ఉన్నాడని అందుకే అతడికే సపోర్ట్ చేస్తున్నాను అని తెలిపింది.