కేవల ఈ ఒక్క పోస్టర్ కి ఆన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారా..?

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ , దిల్ రాజు క్రియేషన్స్ పై తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు తన 50వ చిత్రం గా రామ్ చరణ్ 15వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అధిక బడ్జెట్ తో నిర్మించాలని కోట్లకు కోట్లు పోస్తూన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఇటీవల విడుదల చేయగా.. సినిమాలోని కాన్సెప్టుతో పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ తో పాటు పలువురు స్టార్ హీరోలు సూటు బూటు వేసుకొని ప్రభుత్వ అధికారంలో పనిచేస్తున్నట్లు మనం చూడవచ్చు.

అంతేకాదు కియారా అద్వానీ ,సునీల్ , నవీన్ చంద్ర తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం ఈ సినిమా లో పనిచేస్తున్న పెద్ద పెద్ద స్టార్ హీరో లకు సూటు, బూట్లు వేసి ఒక పోస్టర్ ను ప్రముఖ టెక్నీషియన్స్ తో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ కు ఎంత ఖర్చు పెట్టారు అనే వార్త ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తెగ దుమారం రేపుతోంది. ఇకపోతే ఈ పోస్టర్ కు 1.73 కోట్ల రూపాయలను ఖర్చు చేయించాడట శంకర్. ఇక ఇది విన్న వారంతా పోస్టర్ చాలా బాగుంది.. ఇక సినిమాకు ఇంత బడ్జెట్ పెడతారో అంటూ తమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.