అలియా భట్ పై ఫైర్ అయిన కంగనా రనౌత్.. కారణం ఏమిటంటే?

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హిందూ వివాహం లో ప్రధాన ఆచారమైన కన్యాదానాన్ని కన్యామాన్ గా మార్చుదాం అనే పిలుపు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది నటి కంగనా రనౌత్. ఈ విషయంపై ఆలియాభట్ పై ఒంటికాలిపై లేచింది కంగానా. ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో దేశ సరిహద్దులో జవాను చనిపోతే ఆ అమరవీరుడు తండ్రి చింతించకండి నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు. అతడిని దేశ రక్షణ కోసం దానం చేస్తాను, అది కన్యాదానం అయినా పుత్ర దానం అయినా సరే అంటూ గొప్ప గొప్ప మాటలు మనము నిత్యం టీవీలలో చూస్తూ ఉంటాం. ఎప్పుడు అయితే దానం అన్న పదాన్ని సమాజం చిన్న చూపు చూస్తుందో అప్పుడు రామరాజు స్థాపనకు సమయం ఆసన్నమైందని గుర్తించాలి.

హిందువులను హిందూ ఆచారాలను కించపరచడం ఇకనైనా ఆపండి. గ్రంథాలలో భూదేవిని, స్త్రీ నీ దైవం గానే పూజిస్తారు. వాల్మీకి శక్తి మూలంగా చూడటంలో తప్పులేదు అంటూ ఆకు ఇచ్చింది. అలాగే కన్యాదానం అనే పదాన్ని మార్చేసిన వాణిజ్య కంపెనీ మాన్యవర్ మీద కూడా మండిపడింది కంగనా. అమాయకపు వినియోగదారులకు మీ తెలివైన ప్రకటనలతో మానిప్యులేట్ చేయడం ఆపేయండి అంటూ హెచ్చరించింది. ఆ యాడ్ లో అలియాభట్ ఫ్యామిలీ తనను ఎంతగానో ప్రేమించిందని చెప్తూనే నేనేమైనా వస్తువునా దానం చేయడానికి కన్యాదానం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఇప్పటినుంచి దీన్ని కన్యామాన్ గా మార్చుదాం అని చెప్పుకొచ్చింది.