కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. తన నటనతో కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టి స్టార్ మారిపోయింది అని చెప్పవచ్చు. కేవలం ఒక్క సినిమాతోనే ఈమె కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతుంది.
ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, లింగస్వామి, మాచర్ల నియోజకవర్గం, బంగార్రాజు ఇలా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. తనకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట ఈ బేబమ్మ. మొదటి సినిమా అయినా ఉప్పెన సినిమా కోసం కేవలం ఆరు లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకుందట. ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దాదాపు 60 లక్షల వరకు గిఫ్ట్ రూపంలో అందించారట నిర్మాతలు.
ఈ ఉప్పెన సినిమా విడుదల కంటే ముందుగా ఒప్పుకున్న శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం దాదాపు 20 లక్షల ను పారితోషికంగా తీసుకుందట. ఇక ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు గాను ఈమె 80 లక్షల వరకు పారితోషికం అందుకుంటుందట. ఉప్పెన సినిమా హిందీలో రీమేక్ గా జరుగుతోందని ఇందులో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం కృతి శెట్టి కోటి రూపాయల తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.