డాక్టర్ గా వస్తున్న శివకార్తికేయన్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ చిత్ర పరిశ్రమలో స్వయంకృషి తో ఎదిగి ప్రస్తుతం హీరో గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోల కు గట్టి పోటీ ఇస్తున్న నటుడు శివకార్తికేయన్. మొదట యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన శివకార్తికేయన్ రైటర్ గా, మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్ గా, హీరో గా ఇలా ఈ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సినిమా డాక్టర్.

ఈ సినిమాను గంగా ఎంటర్టైన్మెంట్ ఎస్కే ప్రొడక్షన్ తో కలిసి కోటపాడి జె రాజేష్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందింది. శివ కార్తికేయన్ తో మేము తీసిన శక్తి సినిమా హిట్ అయి మంచి లాభాలు తీసుకువచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు. ఇందులో డాక్టర్ వరుణ్ పాత్రలో కార్తికేయ నవరసాలు చూపించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయడం హ్యాపీగా ఉంది అని అన్నారు నెల్సన్.