ముక్కు అవినాష్ నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?

బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అవినాష్ కూడా ఒకరు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. బుల్లితెరపై జబర్దస్త్ కాకుండా ఇంకా పలు రకాల షోలలో తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అరియనా తో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరిగాయి.ఇదిలా ఉంటే తాజాగా తన పెళ్లికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని తెలిపాడు అవినాష్. మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం వెయిట్ చేయొద్దు. మా ఫ్యామిలీ లు కలిసి మేము కలిసాము వెంటనే ఎంగేజ్మెంట్ అయ్యింది. మీరందరూ నన్ను ఎప్పుడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు.

నేను అనూజ నూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తెలిపారు అవినాష్. అలాగే ఇప్పటి దాకా మీ ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ చేశారు. అలాగే తనకు కాబోయే భార్య ఫోటోలు కూడా షేర్ చేయగా ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాయి. ఈ ఫోటోలను చూసిన వారు అవినాష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.