తెలుగుతో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది.
మాజీ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బట్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కియారా, సిద్ధార్థ్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఆకట్టుకంది. రొమాంటిక్ సన్నివేశాల్లో వీరిద్దరు రెచ్చిపోయారు. పైగా ప్రమోషన్స్‌లోనూ ఈ జోడీ హద్దులు దాటేసి లవర్స్ మాదిరిగా చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. దాంతో వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు అని ఎప్పటి నుంచో వస్తున్న వార్తలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూర్చాయి.
ఈ నేపథ్యంలోనే అటు కియారా, ఇటు సిద్ధార్థ్ ఫ్యాన్స్ ఓ డిమాండ్ చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో మ్యాజిక్ చేసిన కియారా, సిద్ధార్థ్ లు రియల్ లైఫ్‌లో మ్యారేజ్ చేసుకోవాలని సోషల్ మీడియా వేదిగా డిమాండ్ చేస్తూ ఆ జోడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఫ్యాన్స్. దాంతో ప్రస్తుతం వీరి డిమాండ్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, గతంలో కియారా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సిద్దార్థ్ తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని వేరే ఏ రిలేషన్ లేదని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.