ఎన్టీఆర్ షోలో కి గెస్ట్ గా రాబోతున్న రాజమౌళి..?

ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం RRR ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీం గా రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించ బోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్లు ఎంత అద్భుతంగా చిత్రీకరించినట్లు సమాచారం.

ఇందులో కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ పనులన్నీ అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతున్నాయి. అక్కడ రాజమౌళి కారులోంచి దిగినటువంటి కొన్ని ఫోటోలను ఎవరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అవి కాస్త వైరల్ గా మారాయి.

ఇక అంతే కాకుండా ఎవరు మీలో కోటీశ్వరుడు షో కూడా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండటంతో.. రాజమౌళి అక్కడ అ కనిపించడంతో.. మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి గెస్ట్ గా రానున్నరన్నట్లుగా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక మరికొందరైతే..RRR సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండడంతో అక్కడ కనిపించడని మరి కొందరు అనుకుంటున్నారు.అయితే ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.