స్టూడెంట్‌ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్.. తిక్క కుదిర్చిన గ్రామస్థులు?!

స్త్రీల‌నే కాదు చిన్న చిన్న పిల్ల‌ల‌ను కూడా కొంద‌రు మ‌గ మృగాలు వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా ఈ హెడ్ మాస్ట‌ర్ త‌న నీచ‌పు బుద్ధిని చూపించుకున్నాడు. 12 ఏళ్ల మైన‌ర్ బాలిక‌పై లైంగిక వేధింపులకు పాల్ప‌డి.. ఆమె బుగ్గ‌ను కొరికేశాడు. ఈ ఘ‌ట‌న బీహార్ లోని చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

- Advertisement -

Rape Case: Latest News, Videos and Rape Case Photos | Times of India

కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్న 12 ఏళ్ల బాలిక‌ను అక్క‌డే ప‌ని చేస్తున్న హెడ్ మాస్ట‌ర్ లైంగికంగా వేధించాడు. ఈ క్ర‌మంలోనే ఆ స్టూడెంట్ బుగ్గ‌ను కొరికాడు. దాంతో స‌ద‌రు బాలిక కేక‌లు పెట్ట‌డంతో స్టానికులు పరుగుపరుగున వచ్చి ఆ హెడ్ మాస్టర్ ను స్కూల్ గదిలో బంధించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

విద్యార్థిని బుగ్గ కొరికిన ప్రధానోపాధ్యాయుడు.. పోలీసుల ముందే చితకబాదిన  గ్రామస్థులు | ap7am

మ‌రోవైపు బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కూడా స్కూల్ వ‌ద్ద‌కు చేరుకుని.. స‌ద‌రు హెడ్ మాస్ట‌ర్‌ను బ‌య‌ట‌కు లాగి చిత‌క‌బాదారు. ఓవైపు పోలీసులు ఎంత అదుపు చేస్తున్నా.. వారు మాత్రం కర్రలతో కొట్టి హెడ్ మాస్ట‌ర్ తిక్క కుదిర్చారు. ఇక చివ‌ర‌కు ఎలాగోలా వారి బారి నుంచి స‌ద‌రు హెడ్ మాస్ట‌ర్‌ను తప్పించిన పోలీసులు.. స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

Share post:

Popular