స్టేజ్‌పైనే అమ్మాయిల‌తో క‌బ‌డ్డీ ఆడిన గోపీచంద్‌..వీడియో వైర‌ల్‌!

September 9, 2021 at 11:43 am

ట‌లీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కబడ్డీ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబరు 10న విడుదల కానుంది.

Seetimaarr Digital Rights -OTT Release Date | Streaming Online - OTT Raja

ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని చిత్రబృందం ఏర్పాటు చేయ‌గా..ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్‌, ప్రశాంత్‌ వర్మ, కోన వెంకట్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో గోపీచంద్ స్టేజ్‌పైనే అమ్మాయిల‌తో క‌బ‌డ్డీ ఆడి అంద‌రినీ అల‌రించారు.

Seetimaarr Teaser: Gopichand Makes Mass Entry As A Kabaddi Coach; Tamannaah Bhatia Makes A Blink And Miss Appearance (Watch Video)

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీలో రుణ్ ఆరోరా, రెహ్మాన్, రావు రమేశ్, సీనియ‌ర్ హీరోయిన్‌ భూమిక ముఖ్యమైన పాత్రలను పోషించారు.

స్టేజ్‌పైనే అమ్మాయిల‌తో క‌బ‌డ్డీ ఆడిన గోపీచంద్‌..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts