హీరోయిన్ ఇంట్లో దొంగతనం.. లక్షల్లో చోరీ..!

September 9, 2021 at 12:04 pm

ఈ మధ్యకాలంలో దొంగలు ఎక్కువగా పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారు.వీరు సామాన్యుల ఇంటికే కాదు సెలబ్రిటీలు సైతం కూడా వదలడంలేదు. అటువంటి సంఘటన చండీగర్ లో చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు నటి అలంకృత సుహాన్ ని ఇంట్లో బంధించి 6 లక్షల రూపాయల వరకు దోచుకున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే మోడల్ అయినటువంటి నటి అలంకృత..తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం కొంత డబ్బును తీసుకొని చండీగర్ లో ఒక ఇంటిలో అద్దెకి తీసుకుని ఉన్నది.ఢిల్లీలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ల కోసం తను మూడు రోజుల్లో ఇక్కడికి షిఫ్ట్ కావాల్సి ఉంది..ఇదే తరుణంలో మంగళవారం అలంకృత అక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించ బోతుండగా.. అదే సమయంలో ఆమె ఒంటరిగా ఉన్న ఈ విషయాన్ని దుండగులు గమనించి..ఆమెను బలవంతంగా కట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు.

ముగ్గురు వచ్చిన దుండగులు ఒకరు ఆమె ఏటీఎంను తీసుకొని 50 వేల రూపాయలు విత్డ్రా చేసుకున్నారు. మిగతావారు తన ఇంట్లో ఉండేటువంటి నగలను డబ్బులు తీసుకొని పారిపోయినట్లు తెలుపుతోంది.ఆమె మూడు రోజుల కిందట ఒక షాపులో ఫర్నిచర్ కొనగ.. వాటిని డెలివరీ చేసేందుకు కొంత మంది వ్యక్తులు వచ్చారు వారే దొంగతనానికి పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేసింది.ఆమె ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

హీరోయిన్ ఇంట్లో దొంగతనం.. లక్షల్లో చోరీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts