ఫెయిర్ అండ్ లవ్లీ అంటేనే.. మండిపడుతున్న యామీ.. కారణం..

యామీ గౌతమ్.. అప్పట్లో యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ ప్రమోషన్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈమెను అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీగా గుర్తు పెట్టుకున్నారు. ఇకపోతే ఈమె బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్,నితిన్ ల సరసన నటించిన ఈమె తెలుగులో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అందుకే ఈమె బాలీవుడ్ కు మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈమెను ఫేర్ అండ్ లవ్లీ అని పిలుస్తుంటే కోపం గా రియాక్ట్ అవుతోంది.

యామీ గౌతమ్ బాలీవుడ్ లో భూత్ పోలీస్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో యామీ పాల్గొంది. ఈ ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో ఒక ఫోటోగ్రాఫర్.. ఫెయిర్ అండ్ లవ్లీ ఇటు ఒకసారి చూడండి.. అని అనడం తోనే ఆమె కోపంగా రియాక్ట్ అవ్వడం గమనార్హం. ఇంతకుముందు ఫేర్ అండ్ లవ్లీ బ్రాండ్ ఎండార్స్మెంట్ లో పని చేయడంతోనే అతను ఆ పేరుతో పిలిచారు.. కానీ ప్రస్తుతం ఈ బ్రాండ్ మార్కెట్లో వ్యాల్యూ మార్కెట్ లో పడిపోయినప్పటికీ ఈమె మాత్రం ఆ ప్రస్తావనను అంగీకరించడానికి ఒప్పుకోలేదు..

మరోసారి చెప్పండి అంటూ రిప్లై ఇచ్చిన ఈమె, అలాంటి పేర్లతో కాకుండా గౌరవంగా పేరుతో పిలవాలి అని సూచించింది. ప్రస్తుతం ఈమె నటించిన భూత్ పోలీస్ సెప్టెంబర్ 17వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. హార్రర్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.https://www.instagram.com/p/CTRismhpqBw/?utm_source=ig_web_copy_link