చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్న నటుడు.. కారణం..?

తెలుగు సినీ పరిశ్రమలో కొంత మంది హీరోలు తమ చేతులారా తమ కెరీర్ ని నాశనం చేసుకుంటుంటారు. తమకు వచ్చిన ఇమేజ్ ని చెడగొట్టు కుంటూ ఉంటారు. అలా మొదట్లో తన సినిమాలతో బాగా అలరించిన హీరో నవదీప్. తన కెరీర్ ని తానే స్వయంగా నాశనం చేసుకున్నాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలను చూద్దాం.

మొదటిసారిగా టాలీవుడ్ లోకి చందమామ సినిమా తో అడుగుపెట్టిన హీరో నవదీప్.. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ.. నవదీప్ గౌతమ్.. ఎస్ఎస్సి సినిమా తో కూడా మంచి హిట్లు సాధించాడు. ఇక ఆ తర్వాత ఆర్య 2 లో ఒక విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు.

కానీ ఆయన సినిమాలు ఎంచుకునే విషయంలో లోపాలు ఉండడంతో ఆయన హీరో నుండి తొలగిపోయి స్టార్ హీరోల పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అమ్మాయిలను బాగా వాడేసుకున్నాడు అని బ్యాడ్ నేమ్ రావడం తో పాటు అలాగే డ్రగ్స్ కూడా తీసుకుంటాడని అపవాదులు వినిపించాయి. అందుచేతనే ఆయనకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.