బిగ్‌బాస్ 5 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన గూగుల్‌..ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!

ఇటీవ‌ల ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 భారీ స్పంద‌న‌తో దూసుకుపోతోంది. రోజు రోజుకు రంజుగా మారుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. తాజా సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర‌యు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. ఈ మూడో వారంలో మ‌రొక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌నున్నాడు.

Bigg Boss Telugu 5 Contestants List, Repeat Telecast Timing

అయితే గ‌డిచింది కేవ‌లం రెండు వారాలే అయినా.. గూగుల్ మాత్రం అప్పుడు సీజ‌న్ 5 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసింది. అవును, `బిగ్‌బాస్ సీజ‌న్ 5 తెలుగు విన్న‌ర్` అని సెర్చ్ చేస్తే.. గూగుల్ శ్రీరామచంద్ర పేరును సూచిస్తోంది. శ్రీరామ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, నటుడు అని, అంతేకాకుండా ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 5 విజేత కూడా అంటూ అతడి వివరాలను సైతం చూపిస్తోంది.

Sreeram hits the right note as a singer-actor | Hindi Movie News - Times of  India

దాంతో గూగుల్‌ తప్పిదాలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అయితే శ్రీరామ్‌ అభిమానులు మాత్రం గూగుల్‌ ఈ విషయాన్ని ముందే పసిగట్టేసింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, శ్రీ‌రామ్ విష‌యానికి వ‌స్తే.. త‌న‌దైన ఆట తీరుతో ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతూ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్‌గా మారుతున్నారు. మ‌రి గుగూల్ చెప్పిన‌ట్టు ఈయ‌న ఫైన‌ల్స్‌కు చేరి టైటిల్ కొడ‌తాడో..లేదో..చూడాలి.

https://www.instagram.com/p/CUFvhk1JzEc/?utm_source=ig_web_copy_link