బిగ్ బాస్ ప్రియా కు మద్దతుగా యంగ్ హీరో..!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మా టీవీ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో 19 మంది కంటెస్టెంట్ లు పాటిస్పేట్ చేస్తున్నారు. గత వారం సరయు ఎలిమినేట్ అవ్వడంతో 18 మంది కంటెస్టెంట్ ల మధ్య ఒక రేంజ్ లో వార్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఇక ఇందులో ఉన్న ప్రతి కంటెంట్ కు ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు . ప్రస్తుతం సీనియర్ నటులతో ప్రియా అలాగే ఉమాదేవి ఇద్దరు కూడా కంటెస్టెంట్ లు గా పాటిస్పేట్ చేస్తున్నారు..

ఇక బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ క్వీన్ గా ప్రియా గుర్తింపు పొందింది. అయితే ఇటీవల తన పూర్తి మద్దతు ప్రియా కే ఉంటుంది అని బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో రన్నర్ గా మిగిలిన అఖిల్ సార్థక్ పేర్కొన్నారు. ఇకపోతే అఖిల్ సీజన్ ఫోర్ లో ఫ్రెండ్షిప్ ట్రాక్, లవ్ ట్రాక్ అంటూ మెయింటైన్ చేస్తూ చివరి వరకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు అఖిల్ ఫస్ట్ టైమ్ అనే ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడు.. అఖిల్ తో పాటు మరి కొంతమంది తారలు ప్రియా కు మద్దతు ఇస్తున్నట్లు తెలపడం గమనార్హం.