అనుష్క పెళ్లి ఎప్పుడు..? ఎవ‌రితో..? చెప్పేసిన ప్ర‌ముఖ జ్యోతిష్యుడు!

అనుష్క శెట్టి పెళ్లి విష‌యం ఎప్పుడూ హాట్ టాపిక్‌కే. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన ఈ బెంగుళూరు భామ వ‌య‌సు 39 ఏళ్లు. అయినా ఇప్ప‌టికీ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. గ‌తంలో ఎన్నో సార్లు అనుష్క పెళ్లిపై ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి చివ‌ర‌కురూమ‌ర్లుగానే మిగిలి పోయాయి.

- Advertisement -

Throwback: Anushka Shetty Photoshoot Pictures | RITZ

ముఖ్యంగా ప్ర‌భాస్‌, అనుష్క ప్రేమ‌లో ఉన్నార‌ని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని ఎన్నో సార్లు ప్ర‌చారం జ‌రిగింది. ఒకానొక స‌మ‌యంతో ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ను అనుష్క వివాహం చేసుకోబోతోంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అవేమి నిజం కాలేదు. ఈ నేపథ్యంలో ఆమె జాతకాన్ని తాజాగా కొందరు అభిమానులు జ్యోతిష్యులకు చూపించారు. ఆమె జాతకాన్ని చూసిన ప్రముఖ పండిట్ జగన్నాథ్ గురూజీ కీలక విషయాలను తెలిపారు.

Anushka Shetty Photos [HD]: Latest Images, Pictures, Stills of Anushka  Shetty - FilmiBeat

వృత్తి విషయంలో అనుష్క ఎంతో సిన్సియర్ గా ఉంటుందని తెలిపిన గురూజీ.. ఆమె ముఖాన్ని బట్టి చూస్తే, ఒకే వృత్తిలో ఉన్న వారితో కలవడానికి ఆమె ఇష్టపడదని.. అందు వ‌ల్ల ఖ‌చ్చితంగా అనుష్క ఇండస్ట్రీ బయటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటుంద‌ని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఏడాది ఆమె పెళ్లి జరుగుతుందని, లేదంటే 2023లోపు అనుష్క మ్యారేజ్‌ తంతు పూర్తైపోతుంద‌ని గురూజీ జ్యోతిష్యం చెప్పారు. మ‌రి ఈయ‌న జ్యోతిష్యం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి.

Share post:

Popular