నటుడు ప్రతీక్ గాంధీని అరెస్ట్ చేయాలంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

గుజరాతి నటుడు ప్రతీక్ గాంధీ ని అరెస్ట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పట్టుబడుతున్నారు. అయితే ఇందుకు గల కారణం ప్రదీప్ నటించిన కొత్త గా నటించిన భవాయి సినిమాలో కొన్ని సన్నివేశాలు. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు ముందుగా రావణ్ లీలా అనే టైటిల్ ను పెట్టారు. అది కాస్త వివాదాస్పదంగా మారడంతో భవాయి గా మార్చేశారు. అయినప్పటికీ ఈ సినిమా విషయంలో వివాదం చల్లారలేదు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా అందులో కొన్ని సన్నివేశాలపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో నిషేధించాలి అంటూ నెటిజన్ ల నుంచి డిమాండ్ మొదలయింది. భవాని అనేది గుజరాతి జానపద నాటక కళ. దీనికి ఆధారంగా దర్శకుడు హార్దిక్ గజ్జర్ భవాని అనే ప్రేమ కథ తీశారు. ఇందులో లీడ్ క్యారెక్టర్ ల మధ్య లవ్ సీక్వేన్స్ చూపించే క్రమంలో మతపరమైన మనోభావాలు దెబ్బ తీశారు అనేది కొందరి ప్రధాన అభ్యంతరం.ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ప్రతీక్ గాంధీనీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అయితే గతంలో మహారాష్ట్రలో నిషేధానికి గురైన ఓ సినిమా ప్రస్తావన తీసుకు వస్తూ ఇప్పుడు కూడా అదే పని చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. ఒకవైపు దక్షిణాది సినీ పరిశ్రమ మంచి సినిమాలతో భారత సినీ ఖ్యాతి ఎక్కడికో తీసుకెళ్తుంటే బాలీవుడ్ లో మాత్రం కావాలనే మత సెంటిమెంటును దెబ్బ తీసేలా సినిమాలు తీస్తూ దిగజారిపోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.