రోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసిన బన్నీ?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే ఇటీవల బన్నీ కాకినాడకు వెళ్లారు. ఈ సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించడానికి కాకినాడలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ నువ్వు జరుపుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఈయన తినే ఫుడ్ అన్ని కూడా బాగా ఖరీదైన వి గా ఉంటాయి. కానీ కాకినాడ లో పుష్ప మూవీ టీం తో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోకవరం వెళ్తుండగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం పక్కనే ఒక చిన్న హోటల్ వద్ద ఆగారు.

ఆగడమే కాకుండా అక్కడ బన్నీ చిన్న హోటలో టిఫిన్ కూడా చేశారు. ఇలా సాధారణంగా రోడ్డు పక్కన హోటల్ లో టిఫిన్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చి బిల్లు కడుతున్న అల్లు అర్జున్ వీడియో మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు అలాగే అతని ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక రీతిలో స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు.