ఆలీతో సరదాగా షో కి మోహన్ బాబు.. ప్రోమో వైరల్..!

ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ షో వల్ల ఎంతోమంది అలనాటి నటీనటులు గెస్ట్ గా వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారు తాము పడిన కష్టాలను, అవమానాలను, ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ ఉంటారు. అందుచేతనే ఈ షో కూడా బాగా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. అంతే కాకుండా ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నటీనటులకు ఆర్థిక సాయం కూడా అందిస్తుంది ఈషో.

అయితే ఇప్పుడు తాజాగా బుల్లితెర పై యాక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ షోలో పాల్గొంటున్నట్లుగా ఒక ప్రోమో విడుదలైంది. ఈ షో 250 ఎపిసోడ్ హైలెట్ కింద ప్రచారం చేస్తున్నారు. ఇక మోహన్ బాబు 400కు పైగా సినిమాలలో విలన్ గా నటించి, హీరోగా 150కి పైగా చిత్రాల్లో నటించి, 60కి పైగా నిర్మాతగా చిత్రాలను తెరకెక్కించారు. అంతేకాకుండా రాజకీయవేత్తగా టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుగా పేరు సంపాదించుకున్నాడు.

ఇక త్వరలో ఈ టీవీలో తనకు సంబంధించిన కొన్ని విశేషాలను మనతో పంచుకునేందుకు త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. అంతవరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి.