త‌ప్పు చేస్తున్న అనుష్క‌.. అస‌హ‌నంలో ఫ్యాన్స్‌!?

అనుష్క శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క‌.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. కేవ‌లం హీరోల స‌ర‌స‌నే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి స‌త్తా చాటింది.

Baahubali star Anushka Shetty's unseen photo goes viral; fans laud her  natural beauty

అయితే ప్ర‌స్తుతం అనుష్క మునుప‌టి జోరు చూపించ‌డం లేదు. గ‌త ఏడాది నిశ్శబ్దం తో అనుష్క ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ చిత్రం ఘోరంగా ప‌రాచ‌యం పాలైంది. ఇక ఈ సినిమా త‌ర్వాత మ‌రే ప్రాజెక్ట్‌ను అనుష్క ప్ర‌క‌టించ‌లేదు. నవీన్ పొలిశెట్టితో ఈమె ఓ చిత్రం చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా దీని ఊసే క‌నిపించ‌డం లేదు. అయితే ఇప్పుడు మ‌రో వార్త తెర‌పైకి వ‌చ్చింది.

Anushka Shetty to debut in Malayalam with Mammootty's film "Malayalam  Movies, Music, Reviews and Latest News"

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన నెట్రికన్ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజాగా విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నార‌ని.. అందులో అనుష్క న‌టించ‌బోతోంద‌ని ప్ర‌స్తుతం ఓ వార్త వైర‌ల్ అవుతోంది. అయితే నిజానికి నెట్రిక‌న్‌లో బ్లైండ్‌గా న‌టించిన న‌య‌న్‌కు న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే ప‌డ్డా.. ఈ చిత్రం అంచ‌నాలను అందుకోలేక‌పోయింది.

Netrikann Movie Download Isaimini | Netrikann Full Movie Download Tamilyogi  | Nayanthara's Netrikann Movie Download From Tamilrockers For Free -  Filmibeat

పైగా ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. నెగెటివ్ టాక్ తెచ్చుకుని, తెలుగులో కూడా అందుబాటులో ఉన్న సినిమాను అనుష్క ప్రధాన పాత్రలో రీమేక్ చేయడమేంటో అర్థం కావడం లేదు. ఈ నేప‌థ్యంలోనే అనుష్క ఎందుకీ త‌ప్పు చేస్తుంది..? అస‌లు ఇలాంటి సినిమాను ఎందుకు ఎంచుకుందంటూ..? ఫ్యాన్స్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.