ఫోన్‌ను ఎత్తుకెళ్లిన చిలుక.. వీడియో ఎంత బాగా తిసిందో.. వావ్!

సాధారణంగా మనుషులు పక్షులకు, అలాగే జంతువులకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తావైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక చిలుక వీడియో ని తీసింది. అది కూడా గాలిలో ఎగురుతూ కెమెరా షేక్ అవ్వకుండా బ్లర్ అవ్వకుండా క్లారిటీగా వీడియోను తీసింది. పక్షి వీడియో తీయడం ఏంటి అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే.. ఒక వ్యక్తి తన ఫోను చూసుకుంటూ బయట నిలబడి ఉండగా సడన్ గా ఒక రామచిలుక వచ్చి అతని చేతిలో ఉన్న ఫోన్ ఎత్తుకు పోయింది. అలా ఎగురుకుంటూ వెళ్తుండగా ఆ కెమెరా ఆన్ అయింది అంతే కాకుండా వీడియో కూడా రికార్డయింది.

ఆ చిలుక ఫోను తన కాళ్ళ గోళ్ళ తో పట్టుకుని ఉంది. అలా కొద్ది దూరం రోడ్డు గుండా వెళ్లి, మరి కొంచెం దూరం పిల్ల పై వెళుతూ ఇలా ఆఖరికి ఒక కాలు మీద ఆగింది. అప్పటివరకూ ఆ చిలుక గాలిలో ఎగురుతూ ఫోన్ లో వీడియో రికార్డింగ్ చేస్తూనే ఉంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు అయితే డ్రోన్ కెమెరాతో తీసిన వీడియో కూడా ఇంత క్లారిటీ గా ఉండదేమో అన్నట్టుగా రామచిలుక వీడియో ని సూపర్ గా తీసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.