పూరి ఆకాష్ చేతులమీదుగా బ్యాచ్ ట్రైలర్ విడుదల..?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకును సినీ హీరో గా టాలీవుడ్లోకి పరిచయం చేశారు. పూరి జగన్నాథ్ కొడుకు పేరు “ఆకాశ్” ప్రస్తుతం ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం బ్యాచ్. ఈ చిత్రం ని బాగా పాపులర్ చేసేందుకు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చేతుల మీద ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

ఇక ఈ సినిమా గురించి పూరి ఆకాష్ మాట్లాడుతూ”ట్రైలర్ చూశా”చాలా ఆసక్తికరంగా ఉంది.ఈ సినిమాలో రఘు కుంచే సంగీతం చాలా హైలెట్ గా ఉండబోతోంది అన్నట్లు తెలియజేశాడు పూరి ఆకాష్.అంతేకాకుండా ఈ సినిమాని థియేటర్ లోనే విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పడం గొప్ప విశేషం అంటూ చెప్పుకొచ్చారు.మీలాంటి నిర్మాతలు సినీ ఇండస్ట్రీలోకి మరికొంతమంది రావాలని తెలియజేశాడు.

ఇక అంతే కాకుండా సాత్విక్ చైల్డ్ యాక్టర్ గా చాలా సినిమాలలో చూసాం.ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు తనకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సాత్విక్ అని తెలియజేశాడు ఆకాష్ పూరి.ఇక ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ లో నటించిన చాందిని తనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ధన్యవాదాలు తెలిపింది.

ఇక ఈ సినిమాకి సంబంధించి మరికొంతమంది మాట్లాడుతూ బ్యాచ్ అనే టైటిల్ స్కూల్ కాలేజీల్లో చదువుకున్న ప్రతి యువతీ యువకుల కోసం ఇలాంటి సినిమాని, టైటిల్ ని ఎంచుకున్నట్లు తెలియజేశారు ఆ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు.ఈ సినిమా యువతకు బాగా నచ్చుతుందని ఉద్దేశంతోనే తెరకెక్కించాం అని ఆ చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం తెలియజేశారు.