హీరోయిన్ చనిపోయిన రెండు రోజుల తర్వాత దహన కార్యక్రమాలు?

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ లు ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారు చివరి రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని ఎవరు లేని అనాధలు గా తనువు చాలించిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోయిన్ భాల సరస్వతి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. ఈమె అప్పట్లో 15 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా నటించిన ఈమె రాను రాను అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తరువాత ఈమె ఒక ప్రొడ్యూసర్ ప్రేమలో పడి అతనితో సహజీవనం చేసింది.

కొన్నాళ్ళ తర్వాత ఆ ప్రొడ్యూసర్ చెన్నై నుంచి తెనాలి కి రావడంతో ఆమె కూడా అతనితో పాటు తెనాలి కి వచ్చేసింది. అయితే అప్పటికే ఆ ప్రొడ్యూసర్ కి పెళ్లి కావడంతో ఆమెను వదిలేశాడు. ఇలా ఆమె ఇండస్ట్రీలో అవకాశాలు లేక, కుటుంబ సభ్యులు తోడు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆ తర్వాత బీపీ షుగర్ వంటి వ్యాధులు రావడంతో నరకాన్ని అనుభవించింది. అలా చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఆ ఇంటికి అద్దె కట్టలేని పరిస్థితిలో కి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎండాకాలంలో ఎన్ని తట్టుకోలేక ఇంటి లోనే మరణించింది. ఈ విషయం ఎవరికీ తెలియకపోవడంతో రెండు రోజుల తర్వాత ఇంటి నుంచి వాసన రావడంతో మునిసిపాలిటీ వారు వచ్చి అనాధ శవంలా ఆమెకు అంత్యక్రియలు చేశారు.