సంగీత దర్శకుడు చక్రి భార్య ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రతేకంగా పరిచయం అక్కర్లేదు.మ్యూజిక్‌లో తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. చక్రి దాదాపు 85 సినిమాలకు పైగా సంగీతదర్శకత్వం వహించిన చక్రి, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత శ్రావణి అనే అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. చక్రి శ్రావణి పెళ్లి చేసుకోవడం అతని తల్లికి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే శ్రావణి చూస్తే చక్రి తల్లి,సోదరుడు ఆమెతో ఎడమొహం పెడమొహంగా ఉండేవారు.శక్తి ఉన్నంత వరకు ఆమె జీవితం బాగానే ఉంది. కానీ చక్రి చనిపోయిన తరువాత అతని తల్లి అలాగే సోదరుడు ఆమెను హింసలకు గురి చేశారు.

చక్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తులన్నింటినీ అతని తల్లి అలాగే తన సోదరుడు కలిసి దోచేసి ఆ తర్వాత శ్రావణి పై ఆ నేరాన్ని నెట్టేసారు. ఆ తర్వాత శ్రావణి న్యాయం కోసం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ లో ఉన్న ఇంటి ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత విడిగా బతుకుతున్న శ్రావణి తల్లి సోదరుడు ఎన్నో అభాండాలను వేశారు. అంతేకాకుండా శ్రావణి మరొక పెళ్లి చేసుకుంది అని తప్పుడు ప్రచారాలు కూడా సృష్టించారు. ఇప్పటికీ శ్రావణి తన భర్త చక్రి పుట్టిన రోజు న ఎంతో మంది పిల్లలకు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తోంది.