అక్టోబర్ నెలలో..కరోనా థర్డ్ వేవ్… జాతీయ విపత్తు హెచ్చరిక..?

మనం కరోనా నుంచి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి బయటపడినా,కానీ రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ కూడా అంతకంటే ఎక్కువగా ప్రభావం చూపు పోతున్నట్లు జాతీయ విపత్తు శాఖ హెచ్చరించింది. ఆ వివరాలను ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

ప్రపంచ దేశాలలో మళ్లీ కరోనా విజృంభిస్తునే ఉన్నది. ఇప్పటికీ భారత్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చి భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.త్వరలో కూడా భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని ప్రధాన కార్యాలయం నుంచి వచ్చినది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిస్తోంది. ఇది అక్టోబర్ మాసంలో వచ్చే అవకాశం ఉన్నట్లు NiDM నిపుణుల కమిటీ కేంద్రం హెచ్చరిస్తోంది.

థర్డ్ వేవ్ ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యపరంగా అందరూ సంసిద్ధంగా ఉండాలని కేంద్రానికి సూచనలు చేసింది. పిల్లలకు వైద్య పరీక్షలు చేయడానికి పరికరాలు, వైద్య సిబ్బందులు, వెంటిలేటర్స్, అంబులెన్సు వంటి పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని హెచ్చరించింది.

ప్రభుత్వ హాస్పిటల్లో..82% వరకు శిశు వైద్యుల కొరత ఉందని తెలిపారు కమిటీ సభ్యులు. హెల్త్ సెంటర్లలో..63% వరకు పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేసింది. వెంటనే ఆ పోస్టులను ఖాళీ లేకుండా చూడమంటూ కేంద్రానికి తెలిపింది.పిల్లలకు కావాల్సిన వ్యాక్సిన్ ను కూడా రెడీ చేసుకోండి అంటూ కేంద్రానికి నివేదికలు పంపినది.

ప్రస్తుతం దేశంలో 25 వేల కేసులు వచ్చాయి..

కేంద్ర ఆరోగ్య విశాఖ తెలిపిన వివరాల ప్రకారం కొత్తగా 25072 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా ఐదు నెలల కాలంలో కనిష్టంగా తగ్గిపోయాయి. కానీ గడచిన 24 గంటల వ్యవధిలోనే..25,072 కరోనా బారిన పడినట్లు గుర్తించింది.అందులో 389 మంది మరణించారు.దేశంలో మొత్తం కేసుల సంఖ్య..3.24 కోట్లకు చేరాయి.ఇప్పటి వరకు దేశంలో 4,34,756 మంది మృతి చెందారు.గత ఆదివారం 44,157 పంది కరోనా నుంచి కోలుకున్నారు.మొత్తంగా 3.16 కోట్ల మంది రికవరీ అయ్యారు.