మంచు ల‌క్ష్మీ ముందు జాగ్ర‌త్త‌..అలా జ‌ర‌గ‌క‌ముందే చెప్పేసిందిగా!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కూతురు, న‌టి మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన న‌ట‌నా, మాట‌ల‌తో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో `ఆహా భోజ‌నంబు` కుక్కింగ్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మంచు ల‌క్ష్మీ.. ఇటీవ‌లె యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది.

అందులో హోమ్ టూర్ పేరుతో త‌న ఇంటిని చూపించి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. ఇక సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మీ.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. తన స్నేహితురాలి పెళ్లిలో మంచు ల‌క్ష్మీ సంద‌డి చేసినట్టు ఈ వీడియోలో క‌నిపిస్తోంది. ఈ వేడుకల్లో నవదీప్ కూడా మెరిశారు.

అయితే ఈ పెళ్లి వేడుక‌లో అందరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. కానీ ఏ ఒక్కరూ మాస్క్ ధ‌రించలేదు. ఈ విష‌యంలో నెటిజ‌న్లు ట్రోల్ చేస్తార‌ని గ్ర‌హించిన మంచు ల‌క్ష్మీ ముందే జాగ్ర‌త్త ప‌డింది. కేవలం ఫోటోల కోసమే మాస్కులు తీసేశామని చెప్పేయ‌డంతో.. నెటిజ‌న్ల ట్రోలింగ్ నుంచి త‌ప్పించుకుంది. ఇక ప్ర‌స్తుతం మంచు ల‌క్ష్మీ షేర్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/LakshmiManchu/status/1426575503259889667?s=20