`మా` ఎన్నిక‌ల‌కు తేదీ ఖ‌రారు..మ‌రి గెలుపు ఎవ‌రిదో?

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల నిర్వాహ‌ణ‌కు తేదీ ఖ‌రారు అయింది. అక్టోబర్‌ 10న ఎన్నిక‌లు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు.

MAA Elections 2021 | 'మా' ఎన్నికల తేదీ ఖరారు వినోదం News in Telugu

ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఎన్న‌డూ లేని విధంగా ఆరుగురు అభ్య‌ర్థ‌లు బరిలోకి దిగారు.

MAA Elections 2021: 'మా' అధ్యక్షుడి బరిలో ఐదుగురు సభ్యులు.. ఎవరి బలమెంత..  బలగమెంత..?

ఇప్ప‌టికే ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు రేసులో ఉండ‌గా..తాజాగా న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ కూడా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. దాంతో ‘మా’ ఎన్నికల వేడి టాలీవుడ్‌ని హీటెక్కిస్తోంది. మ‌రి ఈ ర‌స‌వ‌త్త‌ర పోరులో చివ‌ర‌కు గెలిచేది ఎవ‌రు? ఓడేది ఎవ‌రు? తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.