అభిమానం అంటే ఇలా ఉంటుంది అని నిరూపించిన పవన్ అభిమాని..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైంది,కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా తగ్గలేదు.ఇంకా పెరుగుతూనే వస్తోంది.ఇక ఈయన సినిమాలు ఎక్కువగా రీమిక్స్ సినిమాలే చేస్తూ ఉంటారు. ఇక ఈయనకు విదేశాలలో కూడా వీరాభిమానులు ఉన్నారు. ప్రజల సేవ కొరకు ఆయన జనసేన పార్టీ స్థాపించగా అది ఆశించిన ఫలితం అందుకోలేదు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని తన అభిమానాన్ని చాటుకుంటూనే తన పెళ్లి కార్డును, ఫ్లెక్సీ గా పవన్ ఫోటో తో నింపేసాడు. అది ఎక్కడో కాదు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు పవన్ కళ్యాణ్ అభిమాని ఈ విధంగా చాటి చెప్పడం గమనార్హం.ఇక తన జనసేన గుర్తు తో పెళ్లి పత్రిక ను తయారు చేయించి ఆ పత్రికను సోషల్ మీడియాలో విడుదల చేయడం వల్ల అది కాస్త వైరల్ గా మారుతుంది.

ఇక ఈ విషయం రెండు రాష్ట్రాల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలియడంతో శ్రీకాంత్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.