హీరో సూర్య‌కు షాకిచ్చిన కేటుగాళ్లు..పోలీసుల‌కు ఫిర్యాదు!

సౌత్ స్టార్ సూర్యకు అనుకోని చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సూర్య‌కు 2డి ఎంటర్‌టైన్మెంట్‌ అనే సొంత నిర్మాణ సంస్థ ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌న సినిమాలే కాకుండా ఇత‌ర హీరోల సినిమాల‌ను సైతం 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య నిర్మిస్తుంటాడు.

Birthday special: 5 memorable movies that prove Suriya is talent  personified | Deccan Herald

అయితే తాజాగా కొంద‌రు కేటుగాళ్లు సూర్య‌ నిర్మాణ సంస్థ పేరును ఉప‌యోగించుకుని.. అవ‌కాశాల పేరు అమాయ‌క ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బును దండుకుంటున్నారు. ఇది గ‌మ‌నించిన 2డి ఎంటర్‌టైన్మెంట్ నిర్వాహ‌కులు వెంట‌నే ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేశారు. `త‌మ సంస్థ పేరు మ‌రియు లోగోను ఊప‌యోగించి కొంద‌రు మోస‌గాళ్లు నకిలీ ఇమెయిల్ ఐడీ([email protected])ని సృష్టించాడు. ఆ ఐడీ ద్వారా కాస్టింగ్ కాల్స్ ప్రకటించి.. డ‌బ్బు చ‌ల్లించ‌మ‌ని కోరుతున్నారు.

Suriya Fans Club™ on Twitter: "○ #Exclusive : Our #Suriya First Productions  #36Vayadhinile Logo Design..:) #Jyothika @Suriya_offl @2D_ENTPVTLTD  http://t.co/xdbE6jzHAY"

కానీ, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అటువంటి ఆడిషన్‌లను నేరుగా నిర్వహించదు. మా ప్రాజెక్ట్‌ల కోసం అన్ని ఆడిషన్‌లు సంబంధిత డైరెక్టర్ల బృందం వారి వారి కార్యాలయాల్లోనే నిర్వహించబడతాయి. మ‌రియు మేము ఆడిషన్‌ల కోసం ఎలాంటి చెల్లింపును వసూలు చేయము. కాబ‌ట్టి, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి, ఇటువంటి ఫేక్ కాల్స్‌ను నమ్మి డ‌బ్బును పోగొట్టుకోవ‌ద్దు` అంటూ 2డి ఎంటర్‌టైన్మెంట్ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. అలాగే 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పేరును మ‌రియు లోగోను దుర్వినియోగం చేసిన మోస‌గాళ్ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా తెలియ‌జేశారు.