అటు చిరు, ఇటు బాల‌య్య‌.. మ‌రి అఖిల్ త‌ట్టుకోగ‌ల‌డా?

August 26, 2021 at 11:27 am

అక్కినేని నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేశాడు. కానీ, ఈ మూడు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయాయి. ఇక త‌న నాల్గొవ చిత్రం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` చేశాడు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది.

Pooja Hegde, Akhil Akkineni's Most Eligible Bachelor to release on Pongal 2021; first poster unveiled-Entertainment News , Firstpost

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. పోని ఓటీటీ వేదిక‌గా విడుద‌ల చేద్దామ‌నుకుంటే.. అది అఖిల్ కెరీర్‌కు మంచిది కాద‌న్న ఉద్దేశంతో మేక‌ర్స్ వెన‌క్కి త‌గ్గారు. ఇక ఎలాగో ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతుండ‌డంతో.. ఈ చిత్రాన్ని దస‌రా బ‌రిలో దింపేందుకు ప్లాన్ చేస్తారు.

Akhanda and Acharya: Where Would They Fit?

అయితే ద‌స‌రా సీజ‌న్లో పోటీ కాస్త గ‌ట్టిగానే ఉండ‌నుంది. ద‌స‌రాకు విడుద‌ల కావాల్సిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌టంతో.. ఆచార్య‌తో అటు చిరు, అఖండ‌తో ఇటు బాల‌య్య బ‌రిలోకి దిగిందుకు సిద్ధ‌మ‌య్యారు. దాంతో ద‌స‌రాకు అఖిల్ థియేట‌ర్‌లోకి దిగి.. చిరు, బాల‌య్య తాకిడిని త‌ట్టుకోగ‌ల‌డా అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అటు చిరు, ఇటు బాల‌య్య‌.. మ‌రి అఖిల్ త‌ట్టుకోగ‌ల‌డా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts